At Home Event At Lok Bhavan Telangana : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉల్లాసభరితంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకీ శుక్లా అతిథులకు తేనీటి విందు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.సింగ్‌తో కలిసి గవర్నర్ దంపతులు అతిథులందరినీ పలకరించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, సీఎస్, డీజీపీ, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేక సందర్భాల్లో గవర్నర్ తేనీటి విందును ఏర్పాటు చేయడం అనేది చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే పంద్రాగస్టు సందర్బంగా ప్రస్తుత గవర్నర్ శివప్రతాప్ శుక్లా తేనీటి విందును ఏర్పాటు చేశారు.
Comments