Skip to playerSkip to main content
  • 7 minutes ago
Huge Python Spotted At Mandamarri : మంచిర్యాల జిల్లా మందమర్రి సీఐఎస్ఎఫ్ కాలనీ వద్ద శనివారం రాత్రి భారీ కొండచిలువ సంచారం కలకలం రేపింది. కాలనీవాసులు బతుకమ్మ ఆడుతున్న స్థలానికి కొంతదూరంలో కొండచిలువ కనిపించింది. దీంతో స్థానికులు సింగరేణి స్నేక్ సొసైటీ సభ్యుడు పుల్లగొర్ల శ్రీనివాస్​కు సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. ఈ కొండచిలువ 12 అడుగుల పొడవు, 20 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అటవీశాఖ అధికారుల సూచనతో సర్పాన్ని అటవీప్రాంతంలో వదిలేశారు. పది రోజుల వ్యవధిలోనే రెండుసార్లు కొండచిలువ ఈ ప్రాంతంలో కనిపించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది జులైలో మందమర్రిలో కొండచిలువ జనావాసాల్లోకి వచ్చింది. మందమర్రి రెండో జోన్ గ్యాస్ గోదాం ముందు ఉన్న దుకాణం సమీపంలోని రమేశ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో కనిపించింది. ఆ కొండచిలువ కూడా సుమారు 12 అడుగుల పొడవు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. 

Category

🗞
News

Recommended