Skip to playerSkip to main content
  • 15 minutes ago
Chintalamuni Nallareddy Swamy Dasami Festivals: కర్నూలు జిల్లా గోనెగండ్లలో చింతలముని నల్లారెడ్డిస్వామి దశమి ఉత్సవాలు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా కబడ్డీ, ఒంగోలు ఎద్దుల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి కబడ్డీ జట్లు, ఒంగోలు ఎద్దులు తరలివచ్చాయి. ఎమ్మెల్యేేేే జయనాగేశ్వరరెడ్డి కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.గోనెగండ్ల గ్రామంలో వెలసిన చింతలముని నల్లారెడ్డి స్వాముల ఆలయంలో చిన్నదశిమి ఉత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు గత వారం రోజుల నుంచి వైభవంగా నిర్వహిస్తుంది. బాల సందర్భంగా స్వాములవారికి తైలాభిషేకం, పుష్పఅలంకరణ, నైవేద్యం, మహా మంగళహారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత ఆదివారం తెల్లవారుజామున పల్లకి సేవను ఆలయం నుంచి ప్రారంభమై ఓబులేసు స్వామి గుడికి వరకు మేళతాళాలతో వైభవంగా ఊరేగించారు. ఊరేగింపునకు హాజరైన వేలాది మంది భక్తులు స్వామి అశ్వాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలు సహా నిన్న గురువారం పలు ఆటల్లో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
00:30Thank you for listening.
01:09Thank you for listening.

Recommended