State Government Gears UP To Meet Increasing Power Demand : వేసవిలో విద్యుతు కోతలు లేకుండా చూసేందుకు ఇంధన శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఫిబ్రవరి మూడో వారానికే విద్యుత్ డిమాండ్ 242.35 మిలియన్ యూనిట్లకు చేరింది. వేసవి ఆరంభంలోనే డిమాండ్ సర్దుబాటు కోసం నిత్యం 10 ఎంయూల విద్యుత్‌ను మార్కెట్‌లో డిస్కంలు కొనాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సారి వినియోగం సుమారు 9 ఎంయూలు పెరిగిందని అధికారులు తెలుపుతున్నారు. గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ ఫిబ్రవరిలో 12,652 మెగావాట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది గ్రిడ్ డిమాండ్ గరిష్ఠంగా 13,347 మెగావాట్లుగా రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ఏఐ అంచనాలో తేలింది.
Category
🗞
News